నారాయణపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆనంద్ గౌడ్

23-09-2026 | 08:53pm

మాగనూరు సెప్టెంబర్ 23: నారాయణపేట జిల్లా(Narayanpet District) కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మాగనూరు మండల కేంద్రానికి చెందిన ఈ. ఆనంద్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు బుధవారం ఒక ప్రకటనలు ఆనంద్ గౌడు తెలిపారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశానికి సి డబ్ల్యూ సి సభ్యులు వంశీచందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఆనంద్ గౌడ్కు నియామక పత్రం అందజేసినట్లు వారు తెలిపారు. ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పార్టీ నాపై నమ్మకం ఉంచి జిల్లా పదవి ఇచ్చినందుకు జాతీయ, రాష్ట్ర, నాయకులకు మంత్రి వాకిటి శ్రీహరి గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు