బైబై గణేషా.. భక్తి శ్రద్దలతో నిమజ్జనం
23-09-2026 | 10:06pm
చందుర్తి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని కిష్టంపేట గ్రామంలో గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చైతన్య యూత్(Chaitanya Youth) ఆధ్వర్యంలో యువతీ యువకుల నృత్యాల నడుమ శోభాయాత్రను కన్నుల పండగగా జరిపారు. ప్రత్యేకంగా వినాయకుడికి పూజలు నిర్వహించి ,మహిళలు తొమ్మిది రోజుల పాటు పూజల్లో ఉత్సాహంగా పాల్గొని, ప్రతిరోజూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రుల్లో చివరి రోజు గ్రామ వీదుల్లో ఊరేగిస్తూ,మంగళ హరతులు, భజన పాటలతో,నిమజ్జనానికి తరలించారు. భక్తులు ‘గణపతి బప్పా మోరియా.. మంగళమూర్తి మోరియా’ అంటూ నినాదాలు చేస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ రెడ్డి బాణాల గంగారెడ్డి, లింగంపెల్లి మనోహర్, ప్రశాంత్, కాశినాధం, అర్జున్, వేణు, సాయి కిరణ్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.