25న ప్రకాశం స్టేడియంలో గణేష్ నిమర్జన పూజ

21-09-2026 | 05:44pm

కొత్తగూడెం సెప్టెంబర్ 21 విజయ క్రాంతి : ఈనెల 22వ తేదీన గణపతి మండపాలు ఏర్పాటు చేసిన వారికి ఉచితంగా, హోమ చూర్ణం  ఆవు నెయ్యి పంపిణీ చేయడం జరుగుతుందని గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు న్యాయవాది యెర్రా కామేష్(Advocate Yerra Kamesh) తెలిపారు.సోమవారం వివేకానంద హైస్కూల్ నందు జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్లా వివేకానంద హైస్కూల్ కు చేరుకుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో,  హోమ చూర్ణం, ఆవు నెయ్యి పంపిణీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 

25 న నిమర్జన కార్యక్రమం స్థానిక ప్రకాశం స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు పూజాకార్యక్రమం, శోభాయాత్ర ప్రారంభమై సూపర్ బజార్ సెంటర్ లో ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద  గణనాధులకు స్వాగత ఏర్పాట్లు చేస్తారు. శోభాయాత్రలో పాల్గొనుటకు మధ్యాహ్నం 3 గంటల కల్లా స్థానిక ప్రకాశం స్టేడియం గ్రౌండ్ కు చేరుకొని నిర్వాహకులకు సహకరించాలని కోరారు.

ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు పలివేల సాంబశివరావు,ఆంధ్రప్రభ లక్ష్మణ్,ప్రధాన కార్యదర్శి దారా రమేష్,మెరుగు చింతేశ్వర్,అవుటుపల్లి రాంబాబు,కుడిక్యాల సమ్మయ్య,ఆకుల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు