ఎండు గంజాయి పట్టివేత

23-09-2026 | 07:51pm

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం(bhadrachalam) శివారులోని ఇసుక ర్యాంపు వద్ద బుధవారం ఎక్సైజ్ పోలీసులు 3.5 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్.కిషన్  ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సీఐ నరేందర్ రెడ్డి పర్యవేక్షణలో  ఎస్ఐ సిహెచ్. శ్రీహరి రావు  సిబ్బంది కలిసి భద్రాచలంలోని ఇసుక రీచ్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించుచుండగా అనుమానాస్పదంగా వస్తున్న యమహా మోటార్ సైకిల్ ను ఆపి తనిఖీ చేయగా దానిలో 3.5 కేజీల ఎండు గంజాయి(Dried marijuana) లభ్యమైంది.

ఇట్టి గంజాయిని నల్గొండ జిల్లా చిట్యాల కు  చెందిన మస్క్ మున్నా,  జున్జు శ్రీనివాస్ లు కలిసి మారేడుమిల్లి నుండి ఘట్కేసర్ కు తరలిస్తూ పట్టుబడినారు.ఇట్టి సీజ్  చేసిన గంజాయిను,ఒక ద్విచక్ర వాహనము, రెండు సెల్ ఫోన్లు  మొత్తం విలువ రూ.2,80,000 స్వాధీనం చేసుకొని  ఇద్దరు ముద్దాయిలను తదుపరి విచారణ నిమిత్తం భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించడం అయినది. ఇట్టి తనిఖీలలో ట్రైనింగ్  లు  సందీప్,పృథ్వీ మరియు కానిస్టేబుల్స్  వీరబాబు, ప్రసన్న కుమార్  డ్రైవర్ సాయి లు పాల్గొన్నారు..

మరిన్ని వార్తలు