ఉపాధి పనులపై డిప్యూటీ కమిషనర్ ఆరా
అశ్వాపురం, అక్టోబర్ 24 (విజయక్రాంతి): అశ్వాపురం మండలం(Ashwapuram Mandal) మొండికుంట గ్రామపంచాయతీ(Village Panchayat) పరిధిలోని బి.జి.కొత్తూరులో శనివారం పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పర్యటించారు. వీబీ-జీ రామ్ జీ పథకం(VB-G Ramji Scheme) కింద కూలీలకు కల్పిస్తున్న 125 రోజుల ఉపాధి పనుల అమలు(Implementation of employment works) తీరును పరిశీలించారు. కూలీలతో నేరుగా మాట్లాడి పనుల కల్పన, ఉపాధి అవకాశాలు(Employment opportunities), ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పథకం అమలు తీరుపై అధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో డీపీఓ అనూష, ఎంపీడీవో ముత్యాలరావు, సర్పంచ్ మర్రి సంధ్య, ఉపసర్పంచ్ చలమల్ల శివకుమార్, ఏపీవో సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి ఎం.సంధ్యారాణి, టీఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.