సీఈవో జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
సిఐటియు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం
పాల్వంచ,(విజయక్రాంతి): ఓట్ల దొంగ జ్ఞానేష్ కుమార్ రాజీనామా(Gyanesh Kumar Resignation) చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం పాల్వంచ అల్లూరి సెంటర్లో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సర్ ప్రక్రియ ద్వారా దొంగిలించారని తద్వారా బిజెపి అధికారంలోకి రావడం కోసం రాజ్యాంగబద్ధమైన సంస్థను, రాజ్యాంగ హక్కులను దుర్వినియోగం చేశాడని ఇందుకుగాను సిఇసి బాధ్యతలు నుండి వైదొలగాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఈ మధు డిమాండ్ చేశారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యకు వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు. ఓటు హక్కును తొలగించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల కమిషన్ హత్య చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫారం 7 ను బిజెపి నేతలు దుర్వినియోగం చేసుకునేందుకు సీఈసీ అవకాశం కల్పిస్తున్నారని తద్వారా అర్హత కలిగిన ఓటర్లను సైతం అక్రమంగా తొలగిస్తున్నారని సిఐటియు పేర్కన్నారు. బెంగాల్ ,బీహార్ రాష్ట్రాల్లో ఎన్నికల ముందు తొలగించబడిన ఓట్లల్లో 97% ఓట్లు సరైనవని అర్హత ఉన్న ఓట్లేనని వాటిని తిరిగి ఓ టర్ల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందన్నారు. సర్ ప్రక్రియ అవకతవకలకు ఎన్నికల కమిషన్ సీఈసీ అవినీతి పరాకాష్టకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే బ్రహ్మచారి, కోశాధికారి ఏజె రమేష్, జిల్లా నాయకులు దొడ్డ రవికుమార్ ఈసం వెంకటమ్మ, పిట్టల అర్జున్ ,కే సత్య తదితరులు పాల్గొన్నారు.