ఎస్సీ సెల్ జిల్లా అధికార ప్రతినిధిగా చల్లా వెంకటనారాయణ

25-11-2026 | 06:01pm

బూర్గంపాడు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా బూర్గంపాడు మండలానికి చెందిన చల్లా వెంకటనారాయణ(Challa Venkatanarayana) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తన నియామకానికి సహకరించిన పార్టీ నాయకులకు వెంకటనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ ఎస్సీ సెల్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఆయన నియామకం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు