బతుకమ్మ వేడుకల్లో బి.ఆర్.ఎస్ నాయకులు
దమ్మపేట, అక్టోబర్ 13(విజయ క్రాంతి): మండల పరిధిలోని మల్లారం కాలనీ ఆడపడుచుల ఆహ్వానం మేరకు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ వేదుకల్లో బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు(BRS party district leaders) సోయం వీరభద్రం(Soyam Veerabhadram) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ 2014 సంవత్సరం లో కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయం లో బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగ గా గుర్తిoచి, బతుకమ్మ పండుగ కి రాష్ట్ర ప్రభుత్వం తరపున బతుకమ్మ చీరలు, నిర్వాహణ నిమిత్తం నిధులు కేటాయించిదని గుర్తు చేసారు. అనంతరం సోయం వీరభద్రంను మహిళలు శాలువాతో ఘనంగా సత్కరిoచారు.
ఈ కార్యక్రమం లో శీలం శ్రీను, దేవా (దేవధానం), అశ్వరావుపేట నియోజకవర్గ యువ రాజకీయ నాయకులు వాడే వీరస్వామి, మహిళలు తధితరులు పాల్గొన్నారు.