శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో అమ్మవారు

13-10-2026 | 02:59pm

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 13 ( విజయక్రాంతి ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక క్రిష్ణకాలని అంబేద్కర్ స్టేడియం(Ambedkar Stadium) ఎదురుగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ కనకదుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు(Sri Kanaka Durga Sharannavaratri Celebrations) మంగళవారం 3వ రోజుకు చేరుకున్నాయి.

3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వగా పురోహితులు కొదురుపాక కృష్ణమాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించగా మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, చిన్నారులు, కమిటీ సభ్యులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు