హైదరాబాద్ మహా ధర్నాను విజయవంతం చేయాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసి సంఘాల(Tribal organizations) ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించే ఆదివాసీల ఆత్మఘోష మహా ధర్నా”(Adivasi Atmaghosha Maha Dharna)ను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో తుడుం దెబ్బ మండల కమిటీ రాయి సెంటర్ ఆధ్వర్యంలో ప స్థానిక ప్రజలతో యువ నాయకులతో కలిసి మహాధర్నా కార్యక్రమ కరపత్రాలు విడుదల చేశారు.
తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత 50సం ల నుండి లంబాడాలు, రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా ఆదివాసి తెగల రిజర్వేషన్ ను అన్యాయంగా ఆక్రమంగా అనుభవిస్తూ వస్తున్నారని, అందుకు మన పూర్వికుల ఆత్మ ఘోసిస్తుందని కావున అక్టోబర్ 14 న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ – ఆదివాసీల ఆత్మఘోష మహా ధర్నాకు అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ ప్రజలు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆదివాసీల ఆత్మఘోష మహా ధర్నాను విజయవంతం చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరుపున ఆయన కోరారు.
లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని 1/70 చట్టం సవరించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన గిరిజనేతరులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఆదివాసీల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయాలి జీవో నంబర్ 3 స్థానంలో కొత్త జీవో తీసుకోవచ్చి ఆదివాసీ ఉద్యోగాలను తిరిగి భర్తీ చేసేందుకు ఆదివాసీ ఎమ్మెల్యేలతో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తీర్మానం చేయాలనీ రిజర్వ్ ఫారెస్టులో ఆదివాసీలు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలి.
టైగర్ జోన్, బపర్ ఏరియా, కోర్ ఏరియా పేరుతో ఆదివాసీలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను ఫారెస్ట్ అధికారులు కట్టుకోకుండా అడ్డుకోవడం మానుకోవాలి. కావున తదితర సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14న హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ లో ఆదివాసీల ఆత్మఘోష మహాధర్నకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది తెగల నాయకులు, ప్రజలు ప్రజాస్వామీక వాదులు మేధావులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు, గోడం గణేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పెందుర్ ప్రభాకర్, తుడుం ఏఈ డబ్ల్యూ సీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు కనక రామారావుగేడం నిరంజన్ జిల్లాఉపాధ్యక్షులు రాజ్ గోండు సేవా సమితి వెడ్మ జంగు ఏ ఈ డబ్ల్యూ సిఏ జిల్లా కార్యదర్శి పెందుర్ త్రిమూర్తి మండల అధ్యక్షులు ఉట్నూర్ ఆత్రం గణపతి డివిజన్ అధ్యక్షులు తొడసం ప్రకాష్ ,ఆయా గ్రామాల పటేల్స్ దేవరి మహాజన్స్ ఆదివాసీ యువకులు ప్రజలు పాల్గొన్నారు.