పాంచ జన్య సంకల్ప సభకు ఏర్పాట్లు...

28-10-2026 | 09:15pm

ఉట్నూర్, అక్టోబర్ 28( విజయక్రాంతి ): ఈనెల 30వ తేదీన  తెలంగాణ రక్షణ సమితి(telangana rakshana samiti)  వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో నిర్వహించే పాంచ  జన్య సంకల్ప సభకు  ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బుధవారం రోజున సభ నిర్వహణ స్థలాన్ని, స్టేజి ఏర్పాటు పనులను  టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు  రూప్ సింగ్ నాయక్, ఖానాపూర్ నియోజకవర్గం  ఇన్చార్జి    మెస్రం దయాకర్, టిఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రూప్సింగ్ నాయక్ మాట్లాడుతూ.. 

సంకల్ప సభను  విజయవంతం చేసేందుకు  ఉమ్మడి జిల్లా పరిధిలోని 10 నియోజకవర్గాల నుండి 50 వేలకు పైగా జన సమీకరణ చేస్తున్నామని  అన్నారు. టిఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చే హామీలతో పాటు  ఆదివాసుల కోసం  సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా  విఫలమైన విషయాన్ని  ప్రజల దృష్టికి తీసుకు వెళ్తారని గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు