జిల్లా ఆర్టీసీలో ఎన్నికల సందడి
కార్మిక సంఘం గుర్తింపు కోసం ప్రచారం
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad district) ఆర్టీసీ సంస్థలో కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల సందడి నెలకొంది. ఈనెల 9న జరిగే ఎన్నికల కోసం కార్మిక సంఘం నేతలు జిల్లాలో పర్యటించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్(Telangana State RTC Employees Union) జనరల్ సెక్రెటరీ ఈదురు వెంకన్న, మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ ఆర్ రెడ్డి, ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అహ్మద్ ఆలీ, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ గౌడ్, స్టేట్ సెక్రెటరీ సంజీవ్ లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిపో గేట్ వద్ద కార్మికులతో సమావేశం అయిన నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. కార్మిక హక్కుల కోసం పోరాడే యూనియన్ కు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో రీజినల్ సెక్రెటరీ ఎండీ అబిద్ పాషా, డిపో సెక్రెటరీ ఎస్.కే నజీమ్, ప్రెసిడెంట్ గంగయ్య, మజ్దూర్ యూనియన్ రీజినల్ ప్రెసిడెంట్ కిషన్, రీజినల్ సెక్రెటరీ గంగాధర్, డిపో సెక్రెటరీ లింగన్న, ప్రెసిడెంట్ దేవిదాస్, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.