పురుగు మందు డబ్బలతో రైతుల ఆందోళన
తాంసి/భీంపూర్, అక్టోబర్ 8(విజయక్రాంతి): వారం రోజులుగా వ్యవసాయానికి విద్యుత్(Electricity for agriculture) సరఫర చేయడం లేదని పురుగుల మందు డబ్బాలతో(pesticide containers) రైతులు అర్ధ నగ్న ప్రదర్శన చేశారు.. గురువారం భీంపూర్ మండలం అర్లి (టీ) విద్యుత్ ఉపకేంద్రం వద్ద గోముత్రి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు.. విద్యుత్ ఉన్నతాధికారులు వచ్చేవరకు కదిలేది లేదన్నారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా మోటార్లు కాలిపోతున్నాయని, పంటకు నీరు అందక ఎండి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. వర్షాలు లేక అవస్థలు పడుతున్నామని ఇప్పుడు ఉన్న నీటిని వినియోగించుకొని పంటను పండిద్దామంటే విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోముత్రి ప్రాంతంలో ఏ చిన్న సమస్య వచ్చిన క్రింది స్థాయి అధికారులు అంతర్ గావ్ వద్ద జంపర్ లు కట్ చేసి,గోముత్రి, కరంజి (టీ),గుబిడి రైతులకు వారల కొద్ది త్రీ ఫ్రిజ్ కరెంట్ ఇవ్వడం లేదని రైతులు వాపోయారు..విద్యుత్ సమస్యలు వస్తె వెంటనే పరిష్కరించడం లేదని ఆరోపించారు.. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి విద్యుత్ క్యాపాసిటర్లు అమరుస్తామని,గోముత్రి ప్రాంతానికి ఒక జేఎల్ఎం ను ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమింప చేశారు..