గన్ని బ్యాగుల డబ్బులు ఎప్పుడు ఇస్తారు
06-10-2026 | 05:39pm
బోథ్, అక్టోబర్ 6 (విజయ క్రాంతి) సహకార సంఘం(Cooperative Society) ద్వారా కొనుగోలు చేసిన జొన్న, సోయాబీన్ పంట అమ్ముకున్న సమయంలో తాము గన్ని బ్యాగులు కొనుగోలు చేసి ఇవ్వడం జరిగిందని, అయితే ఇంతవరకు తమకు గన్ని బ్యాగులకు సంబంధించిన డబ్బులు రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు,
ఈ విషయమై మంగళవారం తమకు గన్ని బ్యాగులకు సంబంధించిన డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ సంబంధిత కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందించారు. కాగా గత వారం రోజుల క్రితం త్వరలో డబ్బులు రైతులు అకౌంట్లో పడతాయని సంబంధిత సీఈవో భూషణ్ వివరించారు. ఆయన ఇంతవరకు డబ్బులు రాలేదని రైతులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.