చెరువును.... తలపిస్తున్న వీధులు!

24-09-2026 | 05:00pm
  1. గడచిన పది సంవత్సరాలుగా.. నూతన డ్రైనేజీ, సిసి రోడ్డుకు నిధులు.. లేకపాయే.
  2. నిధులు కేటాయించి ,మరమ్మతులు చేయాలని వీధి వాసుల ఆవేదన.

తుంగతుర్తి, (విజయ క్రాంతి): గడచిన పది సంవత్సరాలుగా తుంగతుర్తి (Tungaturthi)మండల కేంద్రంలోని పలు వీధుల్లో, నూతన డ్రైనేజీలు సిసి రోడ్లు లేకపోవడంతో చిన్న వర్షానికి, చెరువును తలపిస్తూ, ప్రజలకు అసౌకర్యంగా మారాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని 2వార్డు ,4వార్డ్ తో పాటు, పలు వార్డుల్లో చిన్న వర్షం వస్తే చాలు, ,4 వార్డులోని డ్రైనేజీ మొత్తం చెట్ల ,చెదారముతో మునిగిపోయింది. దీనితో వర్షం పడితే నీరు నిలిచిపోయి, దోమలతో, రోగాల బారిన పడుతున్నట్లు వీధివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా 2వార్డులో గడచిన పది సంవత్సరాలుగా నూతన డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని, గతంలో ఉన్న సర్పంచులు, అధికారులు తెలియజేసినప్పటికీ, నేటి వరకు కూడా డ్రైనేజీ ఏర్పాటు చేయకపోవడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ దవాఖానకు అనుకొని ఉండి, చిన్న వర్షానికి నీళ్లు నిలిచి దోమలతో ఇబ్బందులు పడుతున్నామని వీధివాసులు అంటున్నారు. ఈ వార్డులో గడిచిన 30 సంవత్సరాల క్రితం వేసిన సిసి రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. దీనితో నీళ్లు నిలుస్తున్నాయని, రెండవ వార్డ్ మెంబర్ ఎల్లబోయిన.

శ్రీకాంత్ నాయుడు ప్రత్యేకంగా డ్రైనేజీ సిసి రోడ్ నిర్మాణానికి గతంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం కూడా అందజేశారు. నేటి వరకు కూడా, సమస్య పూర్తి కాలేదని, ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం దారుణమని అన్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి, మండల కేంద్రంలో మెయిన్ రోడ్డుకు పక్కనే ఉన్న రెండో వార్డు ,నాలుగో వార్డులకు తక్షణమే నిధులు కేటాయించి, నూతన డ్రైనేజీ సిసి రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని వీధి వాసులు కోరుతున్నారు.

జిల్లా కలెక్టర్ ,ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు కేటాయించాలి.

రెండవ వార్డ్ మెంబర్ ఎల్లబోయిన శ్రీకాంత్.

గడచిన పది సంవత్సరాలుగా రెండవ వార్డుకు నూతన డ్రైనేజీ, సిసి రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి నూతన డ్రైనేజీ సిసి రోడ్డుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు