చెత్త సేకరణలో ఎస్గి ముందడుగు

24-09-2026 | 04:50pm

సర్పంచ్ లక్ష్మణ్ జాదవ్ ఆధ్వర్యంలో చెత్త సేకరణ బాగా జరుగుతోంది: ఎంపీడీవో మహేశ్వరరావు

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని ఎస్గి గ్రామంలో(Esgi Village) చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి సేకరిస్తున్న విధానాన్ని ఎంపీడీవో మహేశ్వరరావు(MPDO Maheswara Rao) గురువారం పరిశీలించారు. గ్రామాన్ని సందర్శించిన ఆయన తడి, పొడి చెత్తతోపాటు మరో రెండు రకాల వ్యర్థాలను విడివిడిగా సేకరించేందుకు వాహనంలో ఏర్పాటు చేసిన డబ్బాలను పరిశీలించారు.

సర్పంచ్ లక్ష్మణ్ జాదవ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వ్యర్థాలను వేరు చేసి సంబంధిత డబ్బాల్లో సేకరిస్తున్నారు. గ్రామ పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ సర్పంచ్ ఆధ్వర్యంలో చెత్త సేకరణ బాగా జరుగుతోందని ఎంపీడీవో మహేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు