కొమురం భీం ఆశయాల సాధనకు కృషి చేయాలి

04-11-2026 | 05:58pm

డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

ఆసిఫాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణంలో కుమురం భీమ్ స్మారక జెండా ఆవిష్కరణతో పాటు వర్ధంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ(DCC President Athram Suguna) ముఖ్య అతిథిగా హాజరై స్మారక జెండాను ఆవిష్కరించి, కుమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడు కుమురం భీమ్ అని కొనియాడారు.

ఆయన పోరాట స్ఫూర్తి, త్యాగాలు భావితరాలకు ఆదర్శమని, ఆదివాసీల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సర్పంచులు టేకం గంగారాం, జూగాది రావు, సంతోష్, మాజీ ఎంపీపీ మోతిరం, పేందూర్ సుధాకర్, శిడం అర్జు, మాడవి రఘునాథ్, గురునులే నారాయణ, ఉప్పుల కృష్ణ, బాజీరావు, మారుతి, చందన్ షా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు