కేసుల పరిష్కారానికే లోక్ ఆదాలత్

10-09-2026 | 02:09pm

జిల్లా న్యాయమూర్తిని సన్మానించిన గ్రామస్తులు

ఉట్నూర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): చిన్న చిన్న కేసులు సమస్యల పరిష్కారానికి జిల్లా న్యాయ సలహా సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) డి ఎల్  ఎస్ ఏ కార్యదర్శి( న్యాయమూర్తి )హుస్సేన్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని సాలెవాడ( కె ) గ్రామంలో నిర్వహించిన లోకదాలత్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం లోకదాలలో జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ... కోర్టులకు రాకుండా చిన్నచిన్న కేసులు చిన్న చిన్న సమస్యలు లో లోక్ అదాలత్  ద్వారా పరిష్కరించాలని ఉద్దేశంతో  లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. కోర్టులకు పోలీస్ స్టేషన్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

నిరుపేదల కోసం జిల్లా న్యాయ సల హా మండలి జిల్లా సమితి ద్వారా ఉచితంగా కేసుల పరిష్కారం చేయడం జరుగుతుందని లోకదాల కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల్లో యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సైబర్ నేరాలపై జాగ్రత్తలు వహించాలని జిల్లా న్యాయమూర్తి కోరారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు జరిగే ప్రయోజనాల  గురించి న్యాయవాదులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి హుస్సేన్ సాలెవాడ (కె) రావడంతో సర్పంచ్, గ్రామ పెద్దలు యువకులు సాల్వతో సన్మానం చేసి పోలాల అమావాస్య పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలెవాడ (కే )సర్పంచ్ చిక్రమ్ తులసి రామ్, మాజీ ఎంపీటీసీ సాల్గేరి రవీందర్, ఉట్నూర్ బార అసోసియేషన్ అధ్యక్షులు బానోత్ జగన్ నాయక్, ఉట్నూర్, ఆదిలాబాద్ న్యాయవాదులు, గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు