అడవి తల్లి వంటిది.. ప్రకృతిని ప్రతి ఒక్కరు కాపాడాలి
19-09-2026 | 05:59pm
బోథ్,(విజయక్రాంతి): అడవి తల్లి వంటిదని అడవిని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ మేజిస్ట్రేట్ కె సందీప్ కుమార్(Municipal Magistrate K. Sandeep Kumar) పేర్కొన్నారు. శనివారం మండలంలోని నిగిని, బాబేరతండా, కైలాస్ టేకిడి వద్ద న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిని రక్షించుకుంటే ప్రకృతిని కాపాడుకున్నట్టేనని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మానవ మనుగడకు ఎంతో ముడిపడి ఉందన్నారు. ప్రతి ఒక్కరు చట్టాలని గౌరవించాలని కోరారు. చట్టాలను అతిక్రమించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఏజిపి పంద్రం శంకర్, న్యాయవాది కుమ్మరి విజయ్ కుమార్ ,లింభాజీ మహారాజ్, సర్పంచులు గ్రూప్ చంద్ జాదవ్ పద్మా రవీందర్, మాజీ సర్పంచ్ బద్రు, బందు పటేల్ గంగయ్య బాబూలాల్ తదితరులు ఉన్నారు.