గణనాథా నీకు తప్పలేదు నీటి కరువు దెబ్బ

27-09-2026 | 04:40pm

బోథ్ సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): సోనాల మండలంలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. సాగునీటికి ఇబ్బందులు తలెత్తడంతో కొంతమంది రైతులు పొలాల పక్కనే ఉన్న వాగులో నుండి నీటిని పంట పొలాలకు వాడుకుంటున్నారు. దీంతో వాగులో నీరు రోజురోజుకు తగ్గిపోతున్నది. మండల కేంద్రంలోని గణేష్ మండపాలవారు నిమజ్జనం కోసం గానాధులను తీసుకువచ్చి వాగులో నిమజ్జనం చేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం నిండుగా పారే ఈ వాగులో నీరు అంతంత మాత్రమే ఉండడంతో గణనాథులు కనిపిస్తున్నాయి. కరువు దెబ్బ గణనాథుడినికి తప్పలేదు

మరిన్ని వార్తలు