ఎల్‌ఐజీ కాలనీలో నిలిచిన సీసీ రోడ్డు పనులు
సి.ఎం.సి ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యంపై సింధు ఆదర్శ్ రెడ్డి ఆగ్రహం
రామచంద్రపురం నవంబర్ 22: భారతీనగర్ డివిజన్ ఎల్‌ఐజీ కాలనీలో సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులు(CC road restoration works) మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక నివాసితులు, సొసైటీ సభ్యుల ఫిర్యాదుతో(Complaint from society members) మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి(Former Corporator Sindhu Adarsh Reddy) ఈరోజు సంబంధిత రోడ్డును సందర్శించారు.సుమారు 10 రోజుల క్రితం రోడ్డు తవ్వి పనులు నిలిపివేయగా, పలుమార్లు సి.ఎం.సి ఇంజినీరింగ్ సిబ్బందికి తెలియజేసినా స్పందించకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు.
ఈ సందర్భంగా సింధు ఆదర్శ్ రెడ్డి డిప్యూటీ ఇంజినీర్ వెంకట రమణ కు ఫోన్ చేసి, నిలిచిపోయిన సీసీ రోడ్డు పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతగా స్పందించాలని కోరారు.