చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో 1.25000 లకు కైవసం
కండ్లకోయ గ్రామ మాజి సర్పంచ్:కందాడి నరేందర్ రెడ్డి
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్(Medchal) సర్కిల్ పట్టణంలోని కండ్లకోయ మున్సిపల్ పట్టణంలో చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుడి లడ్డు వేలం పాటలో సత్తారి రాజేందర్ ముదిరాజ్ ఒక లక్ష ఎరువై ఐదు వేల రూపాయలకు(125000/)కైవసం చేసుకున్నట్లు కండ్లకోయ గ్రామ మాజి సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం పెద్దలు మాట్లాడుతూ వినాయక నవరాత్రులలో ఘనంగా పూజలందుకున్న లడ్డును వేలం పాటలో గెలుపొందడం మహాభాగ్యమని ఆ దేవా దేవుడి ఆశీస్సులతో సత్తారి రాజేందర్ ముదిరాజ్ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా గత 25 సంవత్సరాల నుంచి చైతన్య యూత్ కమిటీ వినాయక ఉత్సవాలను అన్ని తానై అంగరంగ వైభవంగా నిర్వహించిన సత్తారి రాజేందర్ ను గ్రామ మాజి సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి, ముదిరాజ్ వ్యక్తం అధ్యక్షులు తలారి పెంటేష్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై మేడ్చల్ ఎమ్మెల్యే మాజి మంత్రి చామకూర మల్లారెడ్డి తనయుడు చామకూర మహేందర్ రెడ్డి.మాజి సర్పంచ్ మద్దుల శ్రీనివాస్ రెడ్డి. మున్సిపల్ మాజి కౌన్సిలర్ లు అమరం హేమంత్ రెడ్డి.బేరీ బాలరాజు.సాయిపేట శ్రీనివాస్.డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సాకరబోయిన మల్లేష్ ముదిరాజ్.తలారి రామకృష్ణ.తలారి వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు.