సంగోలి రాయన్న జెండా తొలగింపుపై కురుమ సంఘం ఆగ్రహం

29-09-2026 | 06:08pm

* సమాచారం ఇవ్వకుండానే తొలగించారని ఆరోపణ

* అందరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలని డిమాండ్

* తహసీల్దార్‌కు వినతిపత్రం.. చర్యలు లేకుంటే ఆందోళన హెచ్చరిక

నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలోని సర్వే నంబర్ 3లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు సంగోలి రాయన్న జెండాతో పాటు బీరప్ప మందిర నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకం, జెండాను తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించారని కురుమ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై మంగళవారం నాగల్‌గిద్ద డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక డిప్యూటీ తాసిల్దార్ శివకృష్ణ కు వినతిపత్రం సమర్పించి విచారణ జరిపి న్యాయం చేయాలని మాజీ సర్పంచ్ రాజకుమార్ కురుమ సంఘం సభ్యులు గ్రామస్తులు కోరారు.

సర్వే నంబర్ 3లో ఇతర వర్గాలు, మతాలకు సంబంధించిన విగ్రహాలు, నిర్మాణాలు ఉన్నాయని సంఘం సభ్యులు పేర్కొన్నారు. వాటికి అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని కోరారు. అనుమతులు లేని వాటిని తొలగించాల్సి ఉంటే అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తింపజేయాలని, లేకపోతే తమకు కూడా సమాన అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సంగోలి రాయన్న జెండా, బీరప్ప జెండా తొలగింపుపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా పెద్దఎత్తున ఆందోళన చేపడతామని కురుమ సంఘం సభ్యులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు