ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బిజెపి
బోథ్. అక్టోబర్8( విజయ క్రాంతి) భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) అధికారంలో ఉండి ప్రతిపక్ష నాయకుల గొంతు నొప్పికి వారి దమన కాండము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల పోతున్న విమర్శించారు. గురువారం ఏఐసిసి, టిపిసిసి ఆదేశాల మేరకు సోనాల మండల కేంద్రంలో నిరసన వ్యక్తపరిచారు.
అనంతరం స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినతిపత్రం ఇచ్చారు. ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 13 కోట్ల మంది ఓటర్లను నమోదు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎస్కే మహమ్మద్, ప్రధాన కార్యదర్శి బాసెట్టి సుదర్శన్, సర్పంచ్ లక్ష్మణ్ స్పోక్స్ పర్సన్ రామ్ చందర్, సాకేర గ్రామ కమిటీ అధ్యక్షులు సంతోష్ తో పాటు మాధవరావు బీసీ సెల్ అధ్యక్షులు కే శ్రీనివాస్, ఆశారావు, రాజారామ్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.