రిమ్స్ ను స్మశానంగా మార్చకండి..
- బాలింత సునీత కవల పిల్లల మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలి...
- బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్..
ఉట్నూర్, అక్టోబర్ 29 ( విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నిరుపేద రోగులు దేవాలయంగా భావించే రిమ్స్ ఆస్పత్రిని(RIMS Hospital) స్మశానంగా మార్చవద్దని బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్(BJP Nirmal District President Rithesh Rathod) అన్నారు. ఆయన గురువారం తన నివాసంలో నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ పాత ఉట్నూర్ చెందిన సునీత బాలింతకు సరైన వైద్య అందక బాలింత తో పాటు కవల పిల్లలు మృతి చెందడం సంఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలి అని డిమాండ్ చేశారు.
కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఆదుకోవాలని అన్నారు.ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద ఆసుపత్రి అయిన రిమ్స్ ఆస్పత్రికి వందలాది మంది రోగులు ప్రతిరోజు వచ్చి వైద్య దేవాలయంగా భావించి వస్తారని గుర్తు చేశారు. రిమ్స్ నుస్మశానంగా మార్చే పరిస్థితులు వస్తున్నాయని ఆయన విమర్శించారు.
రెండు నెలల క్రితం రిమ్స్ లో ఏసి పేలిన సంఘటనలో అయిదుగురు శిశువులు మృతి చెందారని ఆ సంఘటన మర్చిపోకముందే మళ్లీ బాలింత సునీత కవల పిల్లలు మృతి చెందడం బాధాకరమని అన్నారు.
నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రిమ్స్ ప్రతిరోజు గర్భిణీలు స్కానింగ్ కోసం 300 నుండి 500 వరకు రోజుకు వస్తారని అంతమందికి ఇలా స్కానింగ్ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం రిమ్స్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, బిజెపి మండల అధ్యక్షులు బింగి వెంకటేష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు, శ్రీపతి లింగాగౌడ్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షులు తన్నీరు సతీష్, గిరిజన మోర్చా జిల్లా నాయకులు రాథోడ్ శేషారావు, నాయకులు రాజేశ్వర్, గాలి శ్రీకాంత్, రామగిరి వేణు, చింతల రమణ, బాణావత్ శ్రీనివాస్, కనక విజయ్, బొంతల భీమన్న, పున్నం సాయి, తదితరులు పాల్గొన్నారు.