అంధకారంలో 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం..
ఉట్నూర్, నవంబర్ 01 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో 24 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Indravelli Primary Health Center) ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంతో పాటు ఉట్నూర్, నార్నూర్, సిరికొండ, ఆదిలాబాద్ రూలర్, గుడిహత్నూర్ మండలాల పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలనుండి వైద్యంతో పాటు ప్రసూతి కొరకు గర్భిణీ స్త్రీలు ఇంద్రవెల్లి కేంద్రానికి నిత్యం వస్తుంటారు. ఆదివారం రాత్రి 8.15 గంటల సమయంలో కొంతమంది వైద్యం కోసం ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు.
ఈ సమయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యుత్ సరఫరా లేక వైద్య సిబ్బంది సమయంకు వైద్యం అందించలేకపోయారు. ఇదే సమయంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడడంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స చేసేందుకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సిబ్బంది 108 అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఉట్నూర్ కేంద్రంగా పనిచేసే కమ్యూనిటీ ఆసుపత్రిలో సైతం విద్యుత్ సరఫరా అంతంత మాత్రాంగానే అవుతుందని, అక్కడి వైద్యులు సైతం చిన్నపాటి జ్వరం వచ్చిన జిల్లా కేంద్రానికి రెఫర్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో వైద్యం అందించుటకు సరియైన వైద్యులతో పాటు వైద్య సిబ్బందిని నియమించడంతో పాటు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.