నాగార్జునసాగర్ లో లెవల్ కాలువలో ప్రమాదకర రసాయనాలు!

02-11-2026 | 12:10am

చింతపల్లి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తుల నిర్వాకం.. స్థానికుల్లో ఆందోళన

నల్లగొండ, నవంబర్ 1 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి సమీపంలో నాగార్జునసాగర్(Nagarjuna Sagar)లో లెవల్ కాలువలో ప్రమాదకర రసాయనాలు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తులు కాలువలో రసాయనాలను పారబోసినట్లు స్థానికులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. కాలువలో రసాయనాలను పారబోసిన వ్యక్తులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనకు పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాలువలో ప్రమాదకర రసాయనాలు కలపడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు కలిగించే ఈ ఘటనపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. రసాయనాలను కాలువలో పారబోసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు