కానిస్టేబుల్ రమేష్ మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే
02-11-2026 | 12:18am
మహమ్మదాబాద్, నవంబర్1 (విజయక్రాంతి): మండల పరిధిలోని నంచర్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ రమేష్ మృతి పట్ల పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(Former MLA Mahesh Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రమేష్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మృతి బాధాకరమని, ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రెడ్డి, సాయి రెడ్డి, తిరుమల రెడ్డి, జి.కిష్టయ్య, బి.రాజుతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు.