యువతిని వేధించిన వ్యక్తిపై కేసు నమోదు
టేకులపల్లి, (విజయక్రాంతి): యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలపై ప్రశ్నించేందుకు వెళ్లిన ఆమె సోదరుడితో ఓ వ్యక్తి ఘర్షణకు దిగిన ఘటన టేకులపల్లి మండలం(Tekulapalli Mandal)లో చోటుచేసుకుంది. టేకులపల్లి మండలం బోడు ఏఎస్ఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. చింతొని చెలక గ్రామానికి చెందిన ఓ యువతిని పక్క గ్రామమైన వజ్జోనిగూడెంకు చెందిన వజ్జ ప్రభాకర్ వేధిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై యువతి సోదరుడు ప్రభాకర్‌ను ప్రశ్నించగా, ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఘర్షణకు దారితీసింది. యువతి తల్లి కంభంపాటి ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వజ్జ ప్రభాకర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ నాగయ్య తెలిపారు.