‘సేవ్ డెమోక్రసీ’ నినాదంతో చలో లోక్‌భవన్
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలని డిమాండ్
ఆలేరు,(విజయక్రాంతి): కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(Election Commissioner of India) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో ‘సేవ్ డెమోక్రసీ’ నినాదం(Save Democracy Slogan)తో నిర్వహించిన చలో లోక్‌భవన్ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయకత్వం వహించారు.
భువనగిరి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నినాదాలు చేశారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌పై ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్, కో-ఆప్షన్ సభ్యుడు కౌసర్, నాయకులు ఈరపాక నర్సింహా, బట్టు ప్రేమ్ కుమార్, సర్పంచ్ రమేష్ నాయక్, సురూపంగా చందు తదితరులు పాల్గొన్నారు.