పదవీ విరమణ పొందిన హిందీ పండిట్ రాములుకు ఘన సన్మానం..

30-09-2026 | 05:55pm

ఆలేరు, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Zilla Parishad High School)హిందీ పండిట్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన బుషిపాక రాములుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాములును ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. శ్రీనివాస్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మధుసూదన్, కొల్లూరు గ్రామ సర్పంచ్ జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి, రవికిరణ్, పడాల శ్రీధర్, మైలారం సత్తయ్య, బూడిద శ్రీనివాస్, గౌడ్, పి. వెంకటయ్య, హెచ్‌ఎం శంకర్, కర్నే శేఖర్, కొరటూరి సత్యనారాయణ, ఎం. సంధ్యారాణి, అరుణకుమారి, కందుల అనిత, రేణుక, నాగలక్ష్మి తదితరులు పాల్గొని రాములుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన విద్యారంగానికి అందించిన సేవలను పలువురు కొనియాడారు.

మరిన్ని వార్తలు