సోలార్ ప్లాంట్ ను సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు

30-09-2026 | 07:02pm

ఎర్రుపాలెం సెప్టెంబర్ 30( విజయ క్రాంతి): మండల పరిధిలోని వెంకటపురం గ్రామంలోని సోలార్ విద్యుత్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ (Andhra Pradesh government)ప్రతి నిధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ప్రతినిధి లింగ చంద్రశేఖర్ బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా ఇక్కడ ఏర్పాటుచేసిన ప్లాంటును సందర్శించడం జరిగిందన్నారు.

వెంకటాపురం సోలార్ ప్లాంట్ ప్రారంభం సమయంలో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుసుకొని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు తనను కూడా కమిటీలో నియమించి సర్వే చేయాలని తెలియజేశారు. వెంకటాపురంలో మహిళా సమైక్యల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ ప్లాంటును ఆదర్శంగా తీసుకొని ఆంధ్రాలో ఏర్పాటు చేయటానికి దీనిపై పూర్తి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందిస్తానని ఆయన తెలిపారు.

ప్లాంట్ ఏర్పాటులో ఏర్పడిన సమస్యలను ఏపిఎం హరి నారాయణ, ప్రాజెక్టు టెక్నీషియన్ ఆయనకు వివరించారు. విద్యుత్,రెవెన్యూ, తదితర శాఖలు పూర్తి సహకారం అందించినట్లు వారు తెలిపారు.ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి ఆదేశాలతో పల్నాడు జిల్లా కలెక్టర్ ఈ ప్లాంట్ ను సందర్శించినట్లు ఆయన తెలిపారు. వెంకటాపురంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ తెలంగాణ రాష్ట్రానికి రోల్డ్ మోడల్ గా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ టెక్నీషియన్ దిలీప్, ఎంపీడీవో శారద,ఏపి ఎం హరి నారాయణ, గ్రిడ్డు అధికారులు, సమైక్య ప్రతినిధులు విజయలక్ష్మి,జ్యోతి, ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొగ్గుల శ్రీనివాస్ రెడ్డి,సొసైటీ అధ్యక్షులు మూల్పురి శ్రీనివాసరావు, వెన్నపూస కృష్ణారెడ్డి, జమలాపురం గ్రామ సర్పంచ్ తుళ్లూరు నిర్మల కుమారి,కర్నాటి సుధాకర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు దోమందల సామేలు,సామినేని రామారావు,వేముల వెంకటేశ్వరరావు, కోగంటి సత్యనారాయణ, సత్యనారాయణ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు