ఉట్నూర్ లో బిజెపి నాయకుల నిరసన

30-09-2026 | 07:16pm

ఉట్నూర్,సెప్టెంబర్ 30( విజయక్రాంతి ): హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం ఉట్నూర్ పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు దేవతలను అవమానించేలా మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. 

హిందూ ధర్మాన్ని హిందూ మనోభావాలను దెబ్బతీసేలా హిందూ దేవతలను ప్రతిసారి కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఒక వర్గాన్ని ఒకతాటిపై తీసుకురావడానికి ఇలా హిందూదేవుళ్లని అవమానించడం ని పతనాన్ని నీవే కొనితెచ్చుకోవడం అని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈకార్యక్రమంలో  ఉట్నూర్ మండల భారతీయ జనతా పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి కొండేరి రమేష్, పట్టణ అధ్యక్షులు తన్నీరు సతీష్, ఓబీసీ మోర్చా అసెంబ్లీ కన్వీనర్ సిపతి లింగాగౌడ్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు, ఉట్నూర్ మాజీ వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, మాజీ ఎంపీటీసీ లు కందుకూరి రమేష్ , సాల్గేరి రవీందర్, శ్రీకాంత్ మండల ప్రధాన కార్యదర్శి ,కాల్వ రవీందర్ మండల నాయకులు విజయ్  రమణ ,కనక విజయ్, రాహుల్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు