సమతుల ఆహారంతో రక్తహీనతను నివారించవచ్చు

30-09-2026 | 06:39pm

కల్లూరు గ్రామ సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాసరావు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): పోషక విలువలు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, మరియు పప్పుల వంటి స్థానిక ఆహార పదార్థాల వినియోగం ద్వారా పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనత లోపాన్ని పూర్తిగా తగ్గించవచ్చని  కల్లూరు గ్రామ సర్పంచ్ చలసాని మంజుల శ్రీనివాసరావు అన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో ముజఫర్ నగర్ ప్రాజెక్ట్, పెంచికల్ దిన్నె సెక్టార్ స్థాయిలో 9వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించిన సందర్బంగా ఆమె మాట్లాడుతూ... మన ప్రాంతంలో సులభంగా లభించే స్థానిక, సాంప్రదాయ ఆహార పదార్థాలను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం చిన్న పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నర్సింహారావు, సీడీపీఓ పడమట పార్వతి, సూపర్‌వైజర్ ఎ. యశోద,రాజ్యలక్ష్మి, వైద్య అధికారి సీతామహాలక్ష్మి , ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు మరియు గ్రామ పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు