ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ నువిమర్శించే స్థాయి లేదు..

30-09-2026 | 07:26pm

ఉట్నూర్, సెప్టెంబర్ 30 ( విజయ క్రాంతి ): ఖానాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) ను విమర్శించే స్థాయి పార్టీ మారిన నాయకులకు లేదని ఉట్నూర్ మండల సర్పంచుల ఫోరం  కన్వీనర్ ఆత్రం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు మెస్రం నాగోరావ్, ఖలీం పాషాలు అన్నారు.

బుధవారం మండల కేంద్రంలో ని ప్రెస్ భవన్ లో విలేకరులతో  నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అరకిల్ల పరమేశ్వర్ రావ్ తో కలిసిమాట్లాడుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ని విమర్శించే స్థాయి పార్టీ మారిన నాయకులకు లేదని,సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్యేను విమర్శించడం తగదని, ఎవరో విమర్శిస్తే ఎమ్మెల్యే కు  కాంగ్రెస్ పార్టీకి ఒరిగేది ఏమి లేదని అన్నారు.

మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ తన తాత  పేరు పైన ఉన్న అసైన్డ్ భూమిని ఈయన పేరిట గిరిజన పెట్రోల్ బంక్ నిర్వహణకు మార్చాలని ఎమ్మెల్యే పై ఒత్తిడి చేయడం, అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే  పేరు చెప్పుకొని అధికారులను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం తోనే సర్పంచ్ గా ఆయన ఓడిపోయారని,ఇక నుండి ఎమ్మెల్యే  పైన కాంగ్రెస్ పార్టీ పైన ఎవరు విమర్శలు చేసిన సహించేది లేదని  హెచ్చరించారు.గత 9 నెలల క్రితమే జనవరి 3న ఆత్రం రాహుల్ ను యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్ష పదవి నుండి అధిష్టానం సస్పెండ్ చేశారని అన్నారు.

ఎమ్మెల్యే  బొజ్జు పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  అనే ఉద్దేశంతో అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదని,యూత్ కాంగ్రెస్ నాయకులు కూడ రాహుల్ పైన ఎలాంటి విమర్శలు చేయలేదని,రాహుల్  మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన,ఎమ్మెల్యే  పైన ఎలాంటి విశ్వాసం లేకుండా ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయనకు అనేక కాంట్రాక్ట్ పనులు ఎమ్మెల్యే ఇచ్చారని,ఇతర పార్టీ నాయకులతో కుమ్మకై ఇసుక దందా చేసిన కూడా ఆయన పైన ఎలాంటి చర్యలు ఎమ్మెల్యే తీసుకోలేదని,రాహుల్ విమర్శించినంత మాత్రాన ఎమ్మెల్యే కి ఒరిగేది ఏమి లేదని వారన్నారు.

ఆదివాసీ సమాజం , కాంగ్రెస్ పార్టీ క్యాడర్,కార్యకర్తలు అండగా నిలుస్తూ పార్టీ లైన్ దాటిన ప్రతిఒక్కరికి తగిన గుణ పాఠం ఉంటుందని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షులు వెడ్మ కొద్దు పటేల్, కాంగ్రెస్ మండల సెక్రటరీలు,మెస్రం శేష నారాయణ, అహ్మద్,సలీం, ఉట్నూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిగుట్ల రాజ్ కుమార్,నాయకులు ఫహీమ్,ఉదయ్, సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు