భువనగిరిలో గరుడ వస్త్ర సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రారంభం

21-09-2026 | 08:22pm

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గరుడ వస్త్ర సిల్క్స్ – ఫ్యామిలీ షాపింగ్ మాల్(Garuda Vastra Silks – Family Shopping Mall)ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbham Anil Kumar Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. పట్టణంలో నూతన వ్యాపార సంస్థలు ఏర్పాటవడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు(Employment opportunities) పెరగడంతో పాటు భువనగిరి పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల-వెంకటేశ్వర్లు, ఆత్మా కమిటీ చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి, భువనగిరి పీఏసీఎస్ చైర్మన్ పక్కిరి కొండల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, షాపింగ్ మాల్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు