శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి

21-09-2026 | 08:48pm

పెద్దపల్లి డిసిపి భూక్యరామ్ రెడ్డి

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): శాంతియుత వాతావరణంలో గణేశుడి నిమజ్జన వేడుకలను జరుపుకోవాలని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి(Peddapalli DCP Bhukya Ram Reddy) తెలిపారు, సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని  సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, ఎలిగేడు, జూలపల్లి మండలంలోనీ గణేష్ మండప నిర్వహకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి మాట్లాడుతూ... తొమ్మిది రోజులు నిష్ఠ నియమాలతో నిర్వహించిన గణేష్ వేడుకలకు చివరి రోజు శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. అల్లర్లకు ఆగడాలకు  తావు లేకుండా చక్కటి భక్తి భావంతో నిమగ్నపు ఊరేగింపును చేపట్టాలని అన్నారు,  నిమజ్జనం సందర్భంగా నిర్వహించే ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించాలి.

గణేష్ నిమజ్జన ఊరేగింపు సందర్భంగా నిర్వాహకులు పాటించాల్సిన శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, డీజే వినియోగం, విద్యుత్ భద్రత, ఊరేగింపు మార్గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై తగిన సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితిలో నిబంధనలు ఉల్లంఘించ వద్దని అలాగే మద్యం జోలికి వెళ్లకుండా భక్తి మార్గంలో నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ ,  సీఐ పొన్నమనేని రంజిత్ రావు,, విద్యుత్ శాఖ డి ఈ, ఏఈ ఎలక్ట్రిసిటీ రామస్వామి, కిషోర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ టి. రమేష్, ఎస్సైలు చంద్రకుమార్, సుధాకర్, సన్నత్ రెడ్డి, మధుకర్ తోపాటు  గణేష్ మండపాల నిర్వాహకులు సమావేశంలో పాల్గొన్నారు.అనంతరం నిమజ్జన ప్రదేశాలైనటువంటి పెద్ద చెరువు కట్టను మునిసిపల్ మరియు ఇతర అధికారులతో డిసిపి  సందర్శించడం జరిగింది.

మరిన్ని వార్తలు