అంతర్గత రోడ్లకు మహర్దశ..

23-10-2026 | 06:40pm

గోవిందరావుపేటలో వేగవంతంగా సిసి రోడ్ల నిర్మాణం 

మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ లకు గ్రామస్తుల కృతజ్ఞతలు

గోవిందరావుపేట, అక్టోబర్ 23 (విజయక్రాంతి) : ములుగు జిల్లా(Mulugu District) గోవిందరావుపేట మండల కేంద్రంలోని అంతర్గత రోడ్లకు మహర్దశ వచ్చింది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని అంతర్గత రోడ్లను సిసి రోడ్లుగా(CC roads) మార్చేందుకు నిధులు మంజూరయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం గోవిందరావుపేట గ్రామంలోని నాలుగో వార్డులో మంత్రి సీతక్క(Seethakka), కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైన అశోక్ సహకారంతో సి ఆర్ ఆర్ ఫండ్స్ లో సిసి రోడ్ లని చేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో గోవిందరావుపేట గ్రామం సర్పంచ్, ఉప సర్పంచ్,  వార్డ్ నెంబర్లు, గ్రామస్తులు, యువకులు పాల్గొనడం జరిగింది. గ్రామస్తులు సంతోషిస్తూ ఏళ్ళ నుంచి రోడ్లు అద్వానంగా ఉండడం, ఇప్పుడు సిసి రోడ్లు పోయడం చాలా ఆనందంగా ఉందని సితక్క, గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ లకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు