ఆలేరు తహసీల్దార్ కార్యాలయానికి సీనియర్ అసిస్టెంట్
ఆలేరు, అక్టోబర్ 1 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో(Aleru Tahsildar's Office) విధులు నిర్వహించేందుకు సీనియర్ అసిస్టెంట్ కె. శ్రీనివాస్ రెడ్డిని డిప్యూటేషన్‌పై నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల ఎల్‌ఏ, ఆర్‌అండ్‌ఆర్ యూనిట్-1 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం నుంచి సెప్టెంబర్ 30న ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శ్రీనివాస్ రెడ్డిని ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్‌ఐగా (MRI) విధులు నిర్వహించేందుకు డిప్యూటేషన్ చేశారు. ఈ మేరకు సెప్టెంబర్ 30న మధ్యాహ్నం ఆయనను ప్రస్తుత కార్యాలయం నుంచి రిలీవ్ చేశారు, వెంటనే ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. శ్రీనివాస్ రెడ్డి ఈరోజు గురువారం రోజున ఆలేరు తహసీల్దార్‌లో విధులలో చేరారు.