పాఠశాలకు 20వేల రూపాయల పది ఫ్యాన్ల వితరణ
01-10-2026 | 04:22pm
తుంగతుర్తి( విజయ క్రాంతి): ప్రముఖ కాంట్రాక్టర్ సంకినేని కృష్ణారావు సతీమణి హేమలత జన్మదిన సందర్భంగా టిఎస్ఆర్ఎస్ పాఠశాలకు (TSRS School)20 వేల రూపాయల విలువ చేసి, పది ఫ్యాన్లను అందించడం జరిగింది కృష్ణారావు మనవడు అయినటువంటి మన్వై బాబు చేతుల మీదుగా అందించడం జరిగింది. పాఠశాలకు గతంలో స్థలం అందించి పాఠశాల నిర్మాణానికి కృషిచేసిన సంకినేని కుటుంబం ఈరోజు పాఠశాలకు 10 ఫ్యాన్ అందించడం హర్షణీయమని స్థానిక సర్పంచ్ మల్లెపక సాయిబాబా అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్ సిబ్బంది స్థానిక ఉపసర్పంచ్ శ్రీనివాస్ బిజెపి మండల అధ్యక్షుడు నారాయణ దాసు నాగరాజు గాజుల మహేందర్ వార్డు మెంబర్లు బొజ్జ యాదగిరి నరేష్, నరసింహ, రాంబాబు ,నవీన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు