వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
నాగిరెడ్డిపేట్,అక్టోబర్ 1 (విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్ సొసైటీ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు(Paddy procurement centers) ప్రారంభించినట్లు సొసైటీ చైర్మన్లు ఆకిడి గంగారెడ్డి, దుండిగల్ నర్సింలు తెలిపారు.మాల్తుమ్మెద సొసైటీ పరిధిలో మాల్తుమ్మెద,నాగిరెడ్డిపేట, చినుర్,వాడి,గోలిలింగాల లింగంపల్లి,వదలపర్తి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సొసైటీ చైర్మన్ దుండిగల్ నర్సింలు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
తాండూర్ కిచ్చన్నపేట్ సొసైటీ పరిధిలో తాండూరు, ఆత్మకూరు,మెల్లకుంట తండా,జప్తి జాన్కంపల్లి, బొల్లారం,పల్లెబోగుడు తండా,రాఘవపల్లి ధర్మారెడ్డి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని అమ్ముకొని కనీసపు మద్దతు ధర లబ్ధిపొందాలని తెలిపారు.
బయట దళారులకు అమ్ముకొని మోసపోవద్దని చివరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.ఎలాంటి అపోహాలకు గురికావద్దన్నారు.ఏ,,రకము వరి ధాన్యం 2461 రూపాయలు కాగా,సాధారణ రకం వరి ధాన్యం 2441 రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్లు ఆకిడి గంగారెడ్డి, దుండిగల్ నర్సింలు, సీఈవోలు సందీప్ కుమార్, చంద్ర మురళి,సర్పంచులు, డైరెక్టర్లు,ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.