విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు

01-10-2026 | 04:52pm
  1. రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి
  2. ఏదులాపురం మున్సిపాలిటీలో టీజీఎన్ పీడీసీఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం 
  3. గృహజ్యోతి లబ్ధిదారులకు రూ. 40.19 కోట్ల సబ్సిడీ వర్తించినట్లు వెల్లడి

ఖమ్మం, అక్టోబర్ 01(విజయక్రాంతి): పాలేరు నియోజకవర్గంలో, ప్రత్యేకంగా ఏదులాపురం మున్సిపాలిటీ (Edulapuram Municipality)పరిధిలో విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారానికి రూ.205 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Telangana Revenue Minister Ponguleti Srinivas Reddy ) వెల్లడించారు.

బుధవారం వరంగల్ క్రాస్ రోడ్ వద్ద గల తరుణీ హట్ ప్రాంగణంలో టి జి ఎన్ పి డి సి ఎల్ డివిజన్ కార్యాలయం, విద్యుత్తు రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ దివాకర టిఎస్, సిపి సునీల్ దత్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు.

గృహ జ్యోతి లబ్ధిదారులకు రూ. 40.19 కోట్ల సబ్సిడీ

వినియోగదారులకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా కొరకు 33కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గత రెండేళ్లలో 632 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించామని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో  నాలుగు సబ్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. పాలేరు నియోజకవర్గంలో గత రెండేళ్లలో గృహ జ్యోతి లబ్ధిదారులకు రూ. 40.19 కోట్ల సబ్సిడీ వర్తించినట్లు తెలిపారు.

మోడల్ సోలార్ గ్రామం పథకం లో భాగంగా.. నేలకొండపల్లిలోని చెరువు మాదారంలో 1,350 మంది గృహ వినియోగదారులకు రూ. 15.66 కోట్ల వ్యయంతో 2,709 కే డబ్ల్యూ సామర్థ్యంతో సౌర విద్యుత్ పలకల పనులు పురోగతిలో ఉన్నాయని, అలాగే రైతుల కోసం రూ. 31.08 కోట్లతో సౌర విద్యుత్ సౌకర్య పనులు చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర విద్యుత్ పునరుద్ధరణ కోసం విద్యుత్ అంబులెన్స్(ఈఆర్టీ వాహనం)ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

ఈ కార్యక్రమంలో..: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి  మద్దినేని స్వర్ణకుమారి,  టీజీఎన్ పీడీసీఎల్ డైరెక్టర్ మధుసూదన్ రావు, ఏదులాపురం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రీనివాస చారి, డీఈ నాగేశ్వరరావు, కాంగ్రెస్ ఏదులాపురం మున్సిపాలిటీ అధ్యక్షులు బానోత్ కిషోర్ నాయక్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు తోట వీరభద్రం, మాజీ మార్కెట్ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, పలువురు కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు