కెనాల్స్ కోసం భూసేకరణ.. రైతుల డిమాండ్ ఇదే!

01-10-2026 | 04:13pm

బేల, అక్టోబర్ 01 (విజయక్రాంతి): చనాక–కొరాట బ్యారేజ్ ద్వారా పంట పొలాలకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న డి-18, డి-19 కెనాల్స్ కోసం భూములు కోల్పోతున్న రైతులతో అధికారులు గురువారం సమావేశం నిర్వహించారు. మండల కార్యాలయంలో తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భూసేకరణకు సంబంధించిన పలు అంశాలపై రైతులతో చర్చించారు.

ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులు మాట్లాడుతూ గతంలో మాదిరిగా కాకుండా ప్రస్తుత మార్కెట్ విలువలు, భూముల ప్రాధాన్యతను పరిగణనలోకి తీసుకుని ఎకరాకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయాలు, అభ్యంతరాలను అధికారులు నమోదు చేసుకున్నారు.

భూసేకరణ (LAND ACQUISITION) ప్రక్రియలో తమకు న్యాయమైన పరిహారం అందించాలని రైతులు కోరారు. తమ భూముల విలువను (LAND VALUE) పరిగణనలోకి తీసుకుని పరిహారం నిర్ణయించాలని తెలిపారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు