పర్యావరణం ద్వారానే ప్రజాహితం
ముకరంపుర, అక్టోబర్ 1(విజయ క్రాంతి): పర్యావరణాన్ని కాపాడుకోవడం ద్వారానే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని తెలంగాణ గ్రామీణ బ్యాంక్(Telangana Grameena Bank ) రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా బ్యాంకు మేనేజర్లు, సిబ్బందితో కలిసి గురువారం స్థానిక సప్తగిరి కాలనీ లోయర్ మానేరు డ్యాం వద్ద మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నానాటికి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా గుర్తించాలని ఆయన కోరారు.గాలి, నీరు, నేల మరియు జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం మానవాళి మనుగడకు అత్యంత ముఖ్యమని అన్నారు.మనచుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని తెలిపారు.