ఘనంగా కృషివ్ రామ్ రెడ్డి జన్మదిన వేడుకలు
పాఠశాల విద్యార్థులకు, వృద్ధులకు సేవా కార్యక్రమాలు
ఎర్రుపాలెం, అక్టోబర్ 1 (విజయ క్రాంతి): మండల పరిధిలోని వెంకటాపురం సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు (Congress leaders)బొగ్గుల గోవర్ధన్ రెడ్డి, లక్ష్మి దంపతుల ఏకైక మనుమడు, బొగ్గుల శ్రీనివాస్ నరేంద్ర రెడ్డి–స్వాతి (యుఎస్ఏ) దంపతుల కుమారుడు బొగ్గుల కృషివ్ రామ్ రెడ్డి మొదటి పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.
వెంకటాపురం గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. తదుపరి మధిరలోని ఆదరణ సేవా ఫౌండేషన్ లో వృద్ధులకు అన్నదానం నిర్వహించి, పండ్లు, మిఠాయిలు అందజేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రత్నమ్మ, వెల్లంకి నాగరాజు, ఆదరణ సేవా ఫౌండేషన్ నిర్వాహకులు నిస్సి హరిణి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బొగ్గుల శ్రీనివాసరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు వెన్నపూస కృష్ణారెడ్డి, నాయకులు వేముల వెంకటేశ్వరరావు, వెర్రు వెంకటేశ్వరరావు, బూసుపల్లి వెంకటరెడ్డి, మేకల రమేష్, ఉపాధ్యాయులు రామారావు, రవిసంతోషం, కవిత, లక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు