చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ట్రస్ట్ సేవలు అభినందనీయం

01-10-2026 | 04:16pm

మెదక్ జిల్లా విద్యాశాఖ ఏఎమ్ఓ సుదర్శనమూర్తి

చేగుంట అక్టోబర్ 01, విజయక్రాంతి: చేగుంట మండలంలోని  పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM Sri Zilla Parishad High School)  చందాయిపేటలోని  48 విద్యార్థులకు 52 వేల రూపాయలను చావలి లక్ష్మీ సుబ్రహ్మణ్యం ట్రస్ట్(Chavali Lakshmi Subrahmanyam Trust) ద్వారా  ఉపకార వేతనం అందజేయడం జరిగింది.    ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ జిల్లా విద్యాశాఖ ఏ ఎం ఓ ( అకాడమీక్ మానిటరింగ్ ఆఫీసర్ ) సుదర్శనమూర్తి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చావాలి లక్ష్మి సుబ్రహ్మణ్యం ట్రస్ట్ సేవలు అభినందనీయమని,  భవిష్యత్తులో వారి సేవలు పేద విద్యార్థులకు విస్తరించాలని, ట్రస్ట్ సభ్యులతో మాట్లాడి పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు   ప్రతిభ పురస్కారాలను  ఇప్పించిన గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీనివాస్ ని వారు అభినందించార. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విఠల్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ,చల్లా లక్ష్మణ్,ఉపాధ్యాయులు వరాల నర్సిములు, సలీం, యాదగిరి, గిరిధర్, సిద్ధిరాములు, శంకర్, వీణ, రాములు, స్వప్న, బంగారయ్య, సౌజన్య, సంతోషి మాతా తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు