దక్కనులో మొఘలుల సామ్రాజ్యం
క్రీ.శ.1687 నుంచి 1724 మధ్యకాలం దక్కన్లో అధికార మార్పిడి ప్రాంతీయ స్థాయి నుంచి భారత దేశం(India)లో సామ్రాజ్యస్థాయికి మారడం కనిపిస్తుంది. ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమైంది. కేంద్రంలో అధికారం బలహీనం కావడంతో ప్రాంతాల మీద ఆధిపత్యం కోల్పోసా గింది. సామ్రాజ్య రాజధాని ఢీల్లీ దూరంగా ఉండ టంతో దక్కన్లో అరాచక పరిస్థితులు నానాటికి పెరిగిపోయాయి. దేశంలో వ్యాపారం పేరుతో ప్రవే శించిన రెండు విదేశీ కంపెనీలైన ఈస్టిండియా, (ఇంగ్లాండ్), కంపెనీ ద ఇండ్ ఓరియంటేల్ (ఫ్రా న్స్) రాజకీయాలు చేయగల స్థాయికి ఎదిగాయి.
బహమనీ రాజ్యం ముక్కలైన తర్వాత ఏర్పడ్డ ముఖ్య పాలనా ప్రాంతం అహ్మద్‌నగర్. నిజాం షాహీల(Nizam Shahis) పరిపాలనలో మొఘల్ చక్రవర్తి(Mughal Empire) జోక్యం చేసు కోవడమొక రాజకీయ పరిణామం. బేరారు, బాలా ఘాట్లను స్వాధీనం చేసుకోవడం అక్బరు వ్యూహం. ఖాందేశ్ నుంచి బాలాఘాట్ను వశపరచుకుంది అహ్మద్ నగర్ రాజ్యం. అది అహ్మద్‌నగర్, గుజరాతుల మధ్య వివాద కారణమైంది. మొఘలులు బేరారును ఆక్రమిం చారు. కానీ, అహ్మద్‌నగర్ మొఘల్ ప్రభుత్వాన్ని అం గీకరించింది.
జహంగీర్ కాలంలో అహ్మద్‌నగర్ కొలువులో ప్రము ఖుడైన మాలిక్ అంబర్ బీజాపూర్‌తో సంబంధాలు నెలకొల్పి, దక్కన్ రాజ్యాల ఐక్యకూటమికి కారణమ య్యాడు. అదే సమయంలో మరాఠాలు బలపడ్డారు. జహంగీర్ మరాఠాలను తన పక్షం తిప్పుకోవడంలో నెగ్గాడు. వారి సాయంతో దక్కన్ సైన్యాల మీద రెండు సార్లు క్రీ.శ.1618, 1620లలో గెలువగలిగాడు. మాలిక్ అంబర్‌ను నిలువరించాడు. తర్వాతి పరిణామాలలో జహంగీరుకు వారసుడనుకున్న ఖుర్రం తిరుగుబాటు దారుడయ్యాడు.
షాజహాన్ పాలనా కాలంలో దక్కన్ రాజప్రతినిధి ఖాన్ జహాలోడీ అహ్మద్ నగర్ నుంచి బాలాఘాటును వశపరచుకోలేకపోయినందుకు ఢిల్లీకి పిలిపించాడు చక్రవర్తి. కానీ, లోడీ తిరుగుబాటుదారుడై దక్కనుకు వెళ్లిపోయాడు. షాజహాన్ అతనిని ఓడించి, ఒక యుద్ధంలో వధించాడు. దక్కనులో అస్థిరత్వం నెలకొనడంతో సంపూర్ణ పరిష్కారం కోరి, షాజహాన్ బీజాపూరుతో మైత్రిని చూపి, అహ్మద్ నగర్‌ను పంచు కున్నాడు. దాంతో అహ్మద్ నగర్ పూర్తిగా నాశనమైపో యింది.
బీజాపూరుతో షాజహాన్ ఒప్పందంతో దక్కన్ భూభాగాలలో 3వ వంతు బీజాపూరుకు పంచడం జరి గింది. ఆ సమయంలో మొఘలులతో అనధికార స్నేహాన్ని కొనసాగించిన గోల్కొండ రాజ్యంతో బీజాపూర్ జోక్యం చేసుకోలేదు. ఒక పదేండ్లలో బీజాపూరు, గోల్కొండ సైన్యాలు కర్ణాటక, తంజావూరు వరకున్న రాజ్యాలను గెలుచుకున్నాయి. షాజహాన్ రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాడు. సామ్రాజ్య విస్తరణలో అదొక వ్యూహం.
దక్కన్ రాజ్యాల(Deccan kingdoms) మీద మొఘలుల వైఖరి మారింది. గోల్కొండ, బీజాపూరులపై క్రీ.శ.1657లో మొఘలుల దాడి జరిగింది. గోల్కొండ రాజ్యంలో వజీరుగా, మీర్ జుమ్లాగా పనిచేసిన మహమ్మద్ సయ్యద్ అర్దెస్తానీ మొఘలుల కొలువులో చేరాడు. షాజహాన్ అతనిని గోల్కొండ రాజ్యాన్ని అప్పగించాలని ఆదేశించాడు. గోల్కొండ రాజ్యం తూర్పుతీరంలో జరుగుతున్న వ్యాపార ప్రయోజనాలను పొందాలన్నదే చక్రవర్తి ప్రధాన ఆశయం. అది నేరవేరింది. ఔరంగజేబు మొదట దక్కను వ్యవహారాలను రాజప్రతినిధులకు వదిలివేసాడు.
ఔరంగజేబు చక్రవర్తి అయ్యాక సగంకాలం ఉత్తర భారత సమస్యలతోనే గడిచిపోయింది. మొఘలుల దండయా త్రలతో దక్కన్ రాజ్యాలు బాగా దెబ్బతిన్నాయి. మొఘ లుల బలహీనత కారణంగా మరాఠాలు ఎదిగిపోయారు. కానీ, క్రీ.శ.1680లో శివాజీ మరణించడం, ఔరంగజేబుపై తిరుగుబాటు చేసిన అతని కొడుకు అక్బర్ శంభాజీ వద్దకు పారిపోయాడు. ఔరంగజేబు కొడుకును పట్టు కోలేకపోయాడు. బీజాపూర్, గోల్కొండలను ఆక్రమిం చుకోలేకపోయాడు. చక్రవర్తిగా సామ్రాజ్యం మేలుకోరి ప్రవర్తించాడు. దక్కన్ రాజ్యాల స్వతంత్రాన్ని ఖాతరు చేయలేదు. సమానులుగా చూడలేదు.
శంభాజీ మరణంతో మరాఠాల్లో భయం
1688 చక్రవర్తి ఔరంగజేబు సైన్యాలు మరా ఠాలు ఆక్రమించుకున్న గోల్కొండ, బీజాపూర్ సరిహద్దు ప్రాంతాలను తిరిగి గెలుచుకున్నాయి. చక్రవర్తికి ఘాజి యుద్దీన్ ఖాన్ ఫిరోజ్ జంగ్, అతని కొడుకు చిన్ కిలిచ్ ఖాన్లు శంభాజీ స్వాధీనంలో వున్న ఉత్తర కొంకణ్, బగ్లానా కొండ ప్రాంతాలను ఆక్రమించే ప్రయత్నాలు స్వల్పంగానే సాధ్యపడ్డాయి. శంభాజీ సైన్యాలు ఔరం గాబాద్ నుంచి బుర్హాన్ పూర్ వరకు 17పెద్దపట్టణాలను ఆక్రమించాయి. తన తండ్రి శివాజీని ఖైదుచేసిన పన్హా లాలోనే రాజుగా నివాసమున్నాడు శంభాజీ.
తన సైన్యా లతో సంగమేశ్వర్ వద్ద ఆగిన సంగతి తెలిసిన షేక్ నిజాం వారిపై ఆకస్మిక దాడి జరిపి, అందరిని అదుపులో నికి తీసుకున్నాడు. శంభాజీని 1689 మార్చి 11న వధిం చారు. మరాఠా శ్రేణులలో భయం కల్పించారు. మొఘల్ సైన్యాధిపతి దుల్ఫికర్ ఖాన్ చేసిన దాడులలో కొన్ని కోటలు వశమైనాయి కాని, శంభాజీ సోదరుడు రాజా రాంను బంధించడానికి వీలు కాలేదు. చివరికి రాణి యేసుబాయి, రాకుమారుడు సాహులను పట్టుకున్నాడు.
చిత్రంగా సామ్రాజ్య శిబిరంలో ఉన్న ఔరంగజేబు రెండవ కుమార్తె జీనతున్నీసా బేగం యేసుబాయిని సోదరిగా, సాహును తన పుత్రునిగా ఆదరించింది. ఔరంగజేబు సుదీర్ఘకాలం ముట్టడి తర్వాత బీజాపూరును ఆక్రమించుకోగలిగాడు. ఆదిల్షా వంశనాశనం జరిగాక ఔరంగజేబు అన్ని షియా చిహ్నా లను తొలగింపజేసాడు. బీజాపూరులోని అమీరులు, ధనవంతులు షియా మతాచారాలను వదిలి సున్నీ సూత్రాలను పాటించవలసి వచ్చింది. బీజాపూరు యువ సుల్తాన్ సికిందర్ ఆదిల్షాను దౌలతాబాద్ కోటలో బంధించారు.
గోల్కొండను దోచుకున్న ఔరంగజేబు
గోల్కొండ సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్‌షా తన కూతు రును ఔరంగజేబు పెద్దకొడుకు మహమ్మద్ సుల్తాన్ కిచ్చి పెండ్లి చేసాడు. మొఘలులతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. దానివల్ల 30 యేండ్లపాటు మొఘలుల దాడుల నుంచి రక్షణ లభించినట్లైంది. 1672లో అబ్దుల్లా కుతుబ్‌షా మరణించిన పిదప, గోల్కొండ అమీరులు అబుల్హసన్ను హైదరాబాద్ రాజ్యసుల్తానుగా చేసారు. అక్కన్న, మాదన్న మంత్రుల మీద రాజ్యభారం పెట్టి, ప్రశాంతంగా ఉండేవాడు తానాషా.
ఔరంగజేబు కొడుకు ఆజమ్ బీజాపూర్ మీద దాడికి వెళ్లినప్పుడే మరొక కొడుకు మువజ్జమ్‌ను హైద్రాబాద్ రాజ్యం మీద దండ యాత్ర చేసి, మొఘల్ సామ్రాజ్యంలో కలిపేయాలని ఆదేశించాడు. గతంలో గోల్కొండ దేశం మీద మొఘ ల్లతో సంధి, రాయబారాలతో వివాదాలు సమసిపో యాయి. కోటికి పైగా పరిహారంగా చెల్లించాడు తానాషా. తన కొలువు నుంచి అక్కన్న, మాదన్నలను తొలగించాడు. కొన్ని ప్రదేశాలను ఆక్రమించుకోనిచ్చాడు. కానీ, అన్నీ తాత్కాలికమే. మువజ్జమ్ హైదరాబాద్‌ను ముట్టడించిన పుడు తానాషా గోల్కొండ కోటలో సైన్య సంరక్షణలో ఉన్నాడు. 8నెలల పాటు యుద్ధం జరిగింది.
1687 సెప్టెంబర్ నెలలో తానాషా సైన్యాధ్యక్షుడు మీర్ మహ మ్మద్ ఇబ్రహీంకు లంచమిప్పించి కోట ద్వారాలు తెరి పించాడు ఔరంగజేబు. గోల్కొండ సేనాని రజాక్ లారీ ఒక్కడే పోరాడి మరణించాడు. తానాషా ప్రతిఘటించకుం డానే లొంగిపోయాడు. బంధీగా తనను దౌలతాబాద్ కోటలోని జైలులో పెట్టారు. గోల్కొండ సంపదనంతా దోచుకున్నాడు ఔరంగజేబు. గోల్కొండ రాజ్యం మొఘల్ సామ్రాజ్యంలో కలిసిపోయింది.
దక్కన్‌ను గెలిచే పట్టు దలతో మొఘల్ సామ్రాజ్య సైన్యం పల్చబడిపోయింది. ఇక కొత్త ప్రదేశాలను ఆక్రమించే అవకాశం లేకుండా పోయింది. నిర్వహణ, తనిఖీలు లేకుండాపోయాయి. ఓడిన రాజ్యాలకు నియమించబడిన మన్సబ్ దారులలో దక్కనీలే ఎక్కువవుండడం ఉత్తరభారతపు అధికారులకు ఆందోళన కలిగించింది. వారు మునుపటిలెక్క మొఘల్ ప్రభుత్వానికి కట్టుబడిలేరు. భూమి శిస్తును ఎక్కువగా వసూలు చేసే అవకాశం లేదు.
మరాఠాల రహస్య ఒప్పందాలు
మరాఠాలు వ్యూహాత్మకంగా చాలాచోట్ల మొఘలు అధికారులతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారు. భారీసైన్యం కలిగివున్న మొఘల్ సైన్యంతో యుద్ధం రాకుండా మరాఠాలు ప్రయత్నించారు. చాలా కోటలు కూడా వాళ్ళ అధీనంలో వుండేవి. మరాఠా నాయకులు స్థానిక ప్రభువులకు తామందించే రక్షణ సాయానికిగాను వారికి వచ్చే ఆదాయంలో 4వ వంతు ‘చౌత్’ వసూలు చేసేవారు. మరాఠాలకు బలమిచ్చింది భోంస్లే కుటుంబం. రాజారాం భోంస్లే మరణించాడు.
పసివాడైన అతడి కొడుకుకు ప్రతినిధిగా రాజారాం భార్య తారాబాయి మొఘలులతో రాయబారాలు నెరపుతూనే, మొఘలుల దుర్గాలమీద ఒత్తిడిని పెంచింది. 1702లో గోల్కొండ రాజ్యంమీద దాడిచేసి, దొరికినంత దోచేసుకుంది. మచిలీపట్నం రేవును కూడా దోచింది. మొఘలుల వ్యాపారానికి అంతరాయం ఏర్పడ్డది. శివాజీ మనవడు సాహు తారాబాయితో తలపడి గెలిచాడు. దాంతో మరాఠాల పట్టు సడలింది. మరాఠాలతో గొడవల కారణంగా దక్కనులో మొఘలుల అధికారం కేంద్రీ కృతం కాలేకపోయింది.
నిజాముల్ ముల్క్ మరాఠాలకు చౌత్ చెల్లించడం మానివేసాడు. అధికార కాంక్షగల మరాఠా నాయకులను సాహూకు వ్యతిరేకంగా నడుపుతూ మరాఠాల ఆధిపత్యానికి అడ్డుతగిలాడు. చక్రవర్తి కొలువులో ఏర్పడ్డ అశాంతి మూలంగా నిజాముల్ ముల్క్‌ను ఢిల్లీకి పిలిపించి, మురాదాబాదుకు, బీహారుకు, మాళ్వాకు బదిలీ చేసారు. దక్కను సుబేదారుగా హుస్సేన్ అలీని నియమించారు.
సామ్రాజ్యాధికారాన్ని ధిక్కరించి స్వతంత్రించే అమీరులు పెరిగిపోయారు. నిజాముల్క్ ముల్క్‌ను మళ్ళీ ఢిల్లీకి పిలిపించారు. అపుడింక తాను యుద్ధం చేసి, స్వతంత్రుడిని కావాలనుకున్నాడు. అసీర్ ఘడ్ను స్వాధీనపరచుకున్నాడు. తర్వాత బుర్హాన్ పూర్‌ను స్వంతం చేసుకున్నాడు. తననడ్డగించిన దిలావర్ ఖాన్ ఓడిపోయాడు. ఆలం అలీఖాన్ మరణించాడు. హుస్సేనలి హత్యచేయబడ్డాడు.
సయ్యద్ అబ్దుల్లా ఓడిపోయి మరణించాడు. దక్కన్ లోని 6 సుబాలకు ప్రభువైనాడు. నిజాముల్ ముల్క్ మొఘల్ ప్రభుత్వం సామ్రాజ్యపు వజీరుగా నియమించబడ్డాడు. మాళ్వా, గుజరాత్ లను దక్కన్ సుబాలో కలిపేసాడు. చక్రవర్తి కొలువులో తనకు శత్రువులు పెరిగిపోవడంతో, చెప్పకుండా దక్కనుకు వెళ్ళిపోయాడు నిజాముల్ ముల్క్. దానికి చక్రవర్తి కోపగించుకొని అతనిస్థానంలో దక్కన్ సుబేదారుగా ముబారిజ్ ఖాన్‌ను నియమించాడు. నిజాంను చంపమని ఆదేశించాడు. నిజాముల్ ముల్క్ పీష్వా 1వ బాజీరావు సాయంతో ముబారిజ్ ఖాన్ ను ఓడించి, వధించాడు. 1725లో హైదరాబాద్ స్వాధీనం చేసుకున్నాడు నిజాముల్ ముల్క్.
మొఘల్ సామ్రాజ్య పాలకుడిగా మహమ్మద్ షా
మహమ్మద్ షా మొఘల్ సామ్రాజ్య పాలకుడుగా 1719 సం.లో అధికారం చేపట్టాడు. అమీరుల వైఖరిలో స్వార్థం పెరిగింది. కానీ, తమ అస్తిత్వాలను నిలుపుకోవడానికి సాంప్రదాయికంగా ఎవరికైనా చక్రవర్తి పేరు మీదనే ప్రతినిధులకు, ఫౌజ్దార్లకు ఫర్మానాలు పంపేవారు. నిజాంకు 6 సుబాల నుంచి మొత్తం మొఘల్ సామ్రాజ్యం ఆదాయంలో సగం 160 మిలియన్ రూపాయల ఆదాయం లభించేది. దక్కన్లో స్వతంత్రానికి అడ్డుపడుతున్నాడని పీష్వా బాజీరావుకు వ్యతిరేకులైన మరాఠాలతో చేతులు కలిపి, తనతో యుద్ధం చేసాడు నిజాం.
కానీ, బాజీరావు నిజాంను 1728లో పాల్ఖేడ్ వద్ద ఓడించాడు. 1732లో ఇద్దరి నడుమ రాజీ కుదిరింది. 1737లో పీష్వా బాజీరావు ఢిల్లీపై దాడిచేసినపుడు మొఘల్ చక్రవర్తి నిజామును దక్కను నుంచి పిలిపించాడు. ‘ఆసఫ్ జా’ అనే బిరుదునిచ్చాడు. నిజాం మళ్లీ బాజీరావు చేతిలో భోపాల్ దగ్గర ఓడిపోయి, అవమానకరమైన సంధి కుదుర్చుకున్నాడు. మాళ్వా సుబేదారిలోని కొంత భూభాగంపై హక్కును బాజీరావుకు ఇవ్వవలసివచ్చింది. నిజాముల్ ముల్క్ 1748 వరకు జీవించాడు. మొఘల్ చక్రవర్తిపట్ల విశ్వాసాన్ని వదులుకోలేదు.
నాదిర్షా తనను ఢిల్లీ సుల్తాన్‌ను చేస్తానన్న ఒప్పుకోలేదు. ఔరంగజేబు మరణాంతరం మొఘల్ సామ్రాజ్యం తన ప్రాభవాన్ని కోల్పోయింది. ప్రాంతీయ పాలకులు స్వతంత్రించారు. నిజాముల్ ముల్క్ గా మారిన చిన్ కిలిచ్ ఖాన్ హైదరాబాద్ రాజ్యస్థాపనకు పూనుకున్నాడు. ముర్షీద్ కులీఖాన్ బెంగాల్, ఒరిస్సాలను తన స్వాధీనం చేసుకున్నాడు. అయోధ్య, పంజాబులు స్వతంత్ర రాజ్యాలైనాయి. మరాఠాలు ఉత్తరదిశగా విస్తరించసాగారు. మాళ్వా, బుందేల్ ఖండ్, గుజరాతులపై దాడిచేసారు. క్రీ.శ.1857వరకు ఎట్లానో మొఘల్ సామ్రాజ్యం కొనసాగింది.
దక్కన్లో మొఘల్ ప్రభుత్వం
దక్కన్లో ప్రాంతీయ ప్రభుత్వం కేంద్రంలో మొఘలుల సామ్రాజ్య ప్రభుత్వ వ్యవస్థనే పోలివుండేది. దక్కన్ ప్రాంతాన్ని సుబాలు(రాష్ట్రాలు)గా, సర్కారులు(జిల్లాలు)గా, పరగణాలుగా విభజించారు. దక్కనులో 6సుబాలు ఏర్పరిచారు. సర్కారు ముఖ్య రెవెన్యూ అధికారిని ఆమిల్ లేదా అమల్ గుజార్ అనేవారు. ఇతనికి సహాయకులుగా బితిక్చి, ఖజానాదార్, షిఖ్దార్ అనే పరగణా అధికారి, కార్కున్ అనే గణనాధికారి వుండేవారు. ఆమిల్ ప్రభుత్వానికి, రైతులకు నడుమ సంధానాధికారి.
మొఘల్ నాణాలు
మొఘలులు మొత్తం 344 టంకసాలలో నాణాలను ముద్రించారు.
1. ఔరంగజేబు నాణెం(గోల్కొండ) -గుండ్రని వెండి టంకం. బొమ్మభాగం: బాద్షా ఔరంగజేబ్ ఆలంగీర్, సిక్కా జద్దర్ జహాఁచు బద్ ఇ మునీర్ 1096 ఎహెచ్(క్రీ.శ.1684), బొరుసు భాగం: జులూస్ ఇ మైమనత్ మనూస్ జర్బ్ కోల్కోండ
2. మొఘల్ ఫణాలు: గుండ్రని బంగారు ఫణాలు 540. బొమ్మభాగం: మొఘల్ పాలకుని పేరు, బొరుసు భాగం: టంకసాల పేరు.
శ్రీరామోజు హరగోపాల్,
కన్వీనర్, కొత్త తెలంగాణ
చరిత్రబృందం
99494 98698