అయ్యబాబోయ్.. హైడీ క్లమ్ ఏంటీ అవతారం!
హాలోవీన్ వేడుకల్లో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు సూపర్‌మోడల్, టీవీ హోస్ట్ హైడీ క్లమ్ (Heidi Klum). ప్రతి ఏడాది తన వినూత్నమైన వేషధారణలతో వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ.. ఈసారి ఏకంగా తెగిపడిన భారీ మానవ చేయి రూపంలో కనిపించి అందరినీ షాక్‌కు గురిచేశారు.ః
అక్టోబర్ 31న నిర్వహించిన తన వార్షిక హాలోవీన్ కాస్ట్యూమ్ పార్టీ (Halloween Costume Party)లో ఈ ప్రత్యేకమైన గెటప్‌తో సందడి చేశారు. తన ఎడమ చేయి నరికివేయబడినట్లుగా కనిపించేలా రూపొందించిన ఈ వేషధారణలో ఆమెను గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. రక్తసిక్తమైన రూపం, భారీ చేయి ఆకృతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఏడాది హైడీ క్లమ్ నిర్వహించిన హాలోవీన్ పార్టీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ వేడుక 25వ వార్షికోత్సవాన్ని (Silver Jubilee) జరుపుకుంటోంది. దీంతో తన ప్రత్యేకమైన కాస్ట్యూమ్‌తో వేడుకకు మరింత హైలైట్‌గా నిలిచారు.
గతంలో 2022లో ఏకంగా పురుగు రూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచిన హైడీ క్లమ్.. ఇప్పుడు తెగిపడిన భారీ చేయి అవతారంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.మొత్తంగా తన వినూత్నమైన వేషధారణలతో హాలోవీన్ వేడుకల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హైడీ క్లమ్.. ఈసారి కూడా తనదైన శైలిలో అందరి దృష్టిని ఆకర్షించారు.