మరో తుఫాన్ ముప్పు.. తీరం దాటేది ఎక్కడంటే!
బంగాళాఖాతంలో బీభత్సం.. 120 కి.మీ. వేగంతో గాలులు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరానికి తుపాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వేగంగా బలపడుతూ Cycloneగా మారుతోంది. నవంబర్ 1 నాటికి తుపానుగా, నవంబర్ 2 నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నవంబర్ 3న నెల్లూరు–నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆ సమయంలో గంటకు 100–110 కిలోమీటర్ల వేగంతో గాలులు, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ Weather System పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. చెన్నై, విశాఖపట్నం, మచిలీపట్నం తీరాలకు సమీపంగా కదులుతున్న నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో అప్రమత్తత పెరిగింది.
మత్స్యకారులకు అలర్ట్.. తీర ప్రాంతాల్లో అప్రమత్తత
తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు Weather Updates ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు. అవసరమైతే ముందస్తు సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. తుపాను దిశ, తీవ్రతలో మార్పులు ఉండే అవకాశం ఉన్నందున IMD తాజా Bulletinలను ప్రజలు గమనించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో అర్నబ్ తుపాన్ బీభత్సం సృష్టించింది.