ఫేస్ క్రీమ్ వాడుతున్నారా..? కిడ్నీలకు ప్రమాదం!
సౌందర్య సాధనాల వినియోగంలో నిర్లక్ష్యం ఓ బాలిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇన్స్టాగ్రామ్ (Instagram) ప్రకటన చూసి కొనుగోలు చేసిన ఫేస్ క్రీమ్ వాడటంతో కేరళకు చెందిన 17 ఏళ్ల బాలిక తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఉగ్రపురానికి చెందిన బాలిక 'ఎఫ్ ట్యూన్' (F Tune) అనే క్రీమ్ ఉపయోగించగా, ఆమె కిడ్నీలు (Kidneys) దెబ్బతిన్నట్లు సమాచారం.
వైద్య పరీక్షల్లో సదరు క్రీమ్‌లో మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే మెర్క్యురీ (Mercury) మోతాదు అనుమతించిన పరిమితి కంటే అధికంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి క్రీమ్ తయారీదారుపై చర్యలకు సిద్ధమయ్యారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ సౌందర్య ఉత్పత్తుల (Fake Cosmetic Products) విక్రయాలపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.